ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 5 రోజుల పాటు సమావేశాలు సాగాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది. చివరి రోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ యూనివర్శిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదం తెలిపింది. ఇక.. తాము ఇచ్చే తీర్మానాలను స్పీకర్ తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.
పోడియం పైకి వచ్చి విపక్ష ఎమ్మెల్యేలు ఇష్టారీతిన చేయడం బాగో లేదని మండిపడ్డారు. సభలో ఇలాగేనా ప్రవర్తించడం అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు, సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లు, పేదల కోసం చేపట్టే ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ చట్ట సవరణ లాంటి కీలక విషయాలు సభ ఆమోదం పొందాయి. అలాగే పోలవరం, మూడు రాజధానులు, వికేంద్రీకరణపై కూడా సీఎం జగన్ సవివరంగా ఈ సమావేశాల్లో మాట్లాడారు.