సింగరేణి బొగ్గు గనులు వేలానికి పెట్టడం దుర్మార్గమని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌  అన్నారు. మోదీ స్నేహితుడు అదానీకి  సింగరేణిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న సంస్థను నిర్వీర్యం చేయొద్దని కోరారు. సింగరేణి విషయంలో బండి సంజయ్‌ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే మూడుసార్లు వేలం ప్రకటన ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. మళ్లీ నాలుగోసారి 4 బొగ్గు గనుల వేలానికి ప్రకటన ఇచ్చారని చెప్పారు.

 

సింగరేణిని ప్రైవేటీకరించవద్దని  ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారని గుర్తుచేశారు. బండి సంజయ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సింగరేణిని ప్రైవేటీకరించకపోతే బొగ్గు గనులను సంస్థకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు చెప్పిన మాటమీద నిలబడటం లేదని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న సంస్థకు గనులు కేటాయించాలన్నారు. సింగరేణిని అదానీకి అప్పజెప్పడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు.