బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని రూపొందించిన సినిమా వీరసింహా రెడ్డి. ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే… ఈ నెల 6 న ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్స్ లో చాలా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మూవీ సెట్ ప్లాన్ వేసింది. ఇప్పటికే ప్రచారం కూడా బాగా జరిగిపోయింది. ఇంతలోనే ఒంగోలు పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ నిర్వాహణకు అనుమతి ఇవ్వలేదు. ఒంగోలు నగరం బయట నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో వీరసింహారెడ్డి మేకర్స్ స్థలాన్ని మార్చేసుకున్నారు. ఏబీఎం గ్రౌండ్స్ లో నిర్వహిస్తే భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తారని, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పోలీసులు అన్నారు. దీంతో ఒంగోలు శివారులోని అర్జున్ ఇన్ ఫ్రా వెంచర్ లో ఈ ఈవెంట్ ను నిర్వహించాలని మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారు.












