రాంగోపాల్ వర్మ మేనమామ మురళి రాజు కన్నుమూత

ప్రముఖ సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) మేనమామ మురళి రాజు (70) మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ భీమవరం చెందిన మురళి రాజు గతంలో సినీ నిర్మాతగా చేసి పలు వ్యాపారాలను కొనసాగించాడు. కాగా మురళి రాజుకు కుమారుడు మంతెన మధు, కూతురు అంబికా, కుమారుడు మధు గజినీ వంటి సినిమాతో పాటు తెలుగు, హింది,తమిళ భాషలలో 34 సినిమాలకు పైగా నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నటులు అల్లు అర్జున్, డైరెక్టర్ క్రిష్, గీత ఆర్ట్స్ మేనేజర్ బన్నీ వాసు తదితరులు మధురానగర్ లోని మురళి రాజు నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ముంబై నుండి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించటానికి వచ్చారు.

Related Posts

Latest News Updates