ఓ టీవీ నటికి జరిగింది. మృణాల్ నవేల్ అనే నటి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘నా కెరీర్ ప్రారంభంలో టీవీ యాడ్స్ చేసేదాన్ని. దాని కోసం ఆడిషన్స్‌కి వెళ్ళినపుడు నాకు ఓ చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఉన్న క్యాస్టింగ్ ఏజెంట్ ఆడిషన్ రిజల్ట్స్ తెలియజేస్తూ ఇద్దరి సెలెక్ట్ చేశామని, అందులో నేను కూడా ఒకదాన్నని చెప్పాడు. మీరు సెలెక్ట్ అయితే కార్తీక్ ఆర్యన్‌తో కలిసి యాడ్‌లో నటించాల్సి వస్తుందని చెప్పాడు. ఆ తర్వాతి రోజే మీరు ఈ యాడ్‌లో నటించాలంటే కాంప్రమైజ్ అవ్వాలని నాకు ఓ మెసేజ్ పంపాడు ఏజెంట్. అతని ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. అయినా ఏం కాంప్రమైజ్ అని అడిగాను. దానికి అతను ‘రాత్రంతా ఇద్దరం కలుసుకుని చిల్ అవ్వడమే’ అని చెప్పాడు. దీంతో నాకు చాలా కోపం వచ్చింది. అతన్ని నోటికి వచ్చినట్టు తిట్టాను’ అంటూ తను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించింది మృణాల్. తాజాగా మృణాల్ వెలుగులోకి తెచ్చిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.