వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కూతురు డా. సునీతా రెడ్డి సుప్రీంను ఆశ్రయించార. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో ఆమె పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ ను సుప్రీం స్వీకరించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని ఈనెల 25వ తేదీదాకా అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సునీత సుప్రీంలో సవాలు చేశారు.