భారత్ లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ప్రారంభం… స్వయంగా తలుపులు తెరిచిన టిమ్ కుక్

భారత్ లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ప్రారంభమైంది. యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ స్వయంగా దీనిని ప్రారంభించారు. కస్టమర్లకు స్వాగతం పలికారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో యాపిల్ బీకేసీ పేరిట యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ప్రారంభమైంది. 22 వేల చదరపు విస్తీర్ణంలో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. లాస్‌ఎంజెల్స్‌, న్యూయార్క్‌, బీజింగ్‌, మిలాన్‌, సింగ్‌పూర్‌ వంటి నగరాల తర్వాత ముంబైలో ఏర్పాటు చేసిన యాపిల్‌ ఐ-ఫోన్‌ రిటైల్‌ స్టోర్‌ను టీమ్ కుక్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక… రెండో యాపిల్ స్టోర్ ఢిల్లీలో తెరవనున్నారు. ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్‌ సిటీవాక్‌ మాల్‌లో ఏప్రిల్‌ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ఏర్పాటైంది. టిమ్ కుక్ దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌కు విచ్చేశారు. 2016లో ఈయన భారత్‌కు వచ్చారు. మళ్లీ ఇప్పుడు స్టోర్ లాంచ్ చేశారు. అంతేకాకుండా యాపిల్ రెండో రిటైల్ స్టోర్ ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. గురువారం రోజున దీన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా యాపిల్ కంపెనీ భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్ అమ్మకాలు పెంచుకొని అధిక వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఇక… ముంబై యాపిల్ స్టోర్ ను ప్రారంభించిన నేపథ్యంలో కస్టమర్లు భారీగా తరలి వచ్చారు. స్టోర్ మొత్తం కలియదిరిగారు. ఇక… కస్టమర్లకు ఇబ్బంది కాకుండా… డివైజ్ లను ఆపరేట్ చేయడంలో అక్కడి యాపిల్ ప్రతినిధులు సహాయం అందించనున్నారు. అక్కడి స్టోర్ లోనే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. దాదాపు 100 మంది యాపిల్ ప్రతినిధులు పనిచేస్తున్నారు. యాపిల్ ప్రొడక్ట్ కి సంబంధించి, ఎలాంటి సహాయ సహకారాలనైనా అందిస్తారు. మొత్తం 20 భారతీయ భాషల్లో మాట్లాడే ప్రతినిధులు వున్నారు. ఈ స్టోర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంపైనే పనిచేస్తుంది.

 

Related Posts

Latest News Updates