ఏఈ పరీక్ష రద్దుపై తాము బుధవారం నిర్ణయం తీసుకుంటామని TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ప్రవీణ్ పేపర్ లీకేజీకి పాల్పడినట్లు తేలిందన్నారు. సోషల్ మీడియా, మీడియాలో వదంతులు వస్తున్నాయని, వదంతులకు అడ్డుకట్ట వేసేందుకే తాము ప్రెస్ మీట్ పెట్టామని పేర్కొన్నారు. TSPSC ఏఈ పేపర్ లీక్ వ్యవహారంపై కమిషన్ అత్యవసరంగా సమావేశమైంది. ఆ తర్వాత TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

 

ఏఈ పరీక్షకు ముందు రోజు పేపర్ లీకేజీపై తమకు సమాచారం వచ్చిందని, దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసుల దర్యాప్తులో 9 మంది నిందితులుగా తేలారన్నారు. TSPSC పరీక్షల్లో మాస్ కాపీయింగ్, అవకతవకలు జరిగే ఛాన్స్ లేదన్నారు. రాజశేఖర్ రెడ్డి అనే నెట్ వర్క్ ఎక్స్ పర్ట్ 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని, నెట్ వర్క్ ఎక్స్ పర్ట్ కావడంతో ఐపీ అడ్రస్ తెలిసే అవకాశం వుంటుందన్నారు.