ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా కోసం అందరూ ఎంతగా ఎదురుచూస్తున్నారనేది తెలిసిన విషయమే. రీసెంట్ గా రిలీజైన టీజర్ లో ఎక్కువ కంటెంట్ రివీల్ చేయకపోవడంతో ఫ్యాన్స్ అప్సెట్ అయిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆ టీజర్ లో అల్లు అర్జున్ గెటప్ చూసి ట్రేడ్ వర్గాల్లో ఉన్న హైప్ ఒక్కసారిగా పెరిగింది. https://cinemaabazar.com/
టీజర్ యూట్యూబ్ లో 138 గంటల పాటూ టాప్ ట్రెండింగ్ లో ఉండటంతో కొత్త రికార్డు పుష్ప2 పేరిట రికార్డైంది. పుష్ప2 నుంచి పాటో, ట్రైలరో వచ్చే లోపు టీజర్ వ్యూస్ మ్యాజిక్ ఫిగర్స్ నమోదు చేయడం ఖాయం. టీజర్ కే ఈ రేంజ్ లో ఉందంటే పుష్ప2 మానియా ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఈ రెస్పాన్స్ చాలా ఎక్కువ. https://cinemaabazar.com/
ఫస్ట్ రోజు ఎక్కువ వ్యూస్ సాధించలేకపోయినా, ఆ తర్వాత నాన్ స్టాప్ గా నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉండటమంటే మాటలు కాదు. ఈ సినిమాతో రూ.1000 కోట్ల బిజినెస్ ను ఆశిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, సినిమాను దానికి తగ్గట్టే ప్రమోట్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ యాంగిల్ లో చూస్తే పుష్ప2 సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆగస్టు 15న రిలీజ్ కానున్న పుష్ప2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.