ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం పవన్ ఏపీ ఎలక్షన్స్ హడావిడిలో బిజీగా ఉండటంతో ఆ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ ఏడాది జులై లేదా ఆగస్ట్ నుంచి మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ అయ్యే ఛాన్సుంది.https://cinemaabazar.com/
ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లో ఉంటున్న ఓజీ సినిమా ఇప్పుడు మరోసారి చర్చల్లోకెక్కింది. హనుమాన్ తర్వాత తేజ సజ్జ హీరోగా మిరాయ్ అనే సినిమా రూపొందుతుంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ సినిమా టైటిల్, ఇతర విషయాలను చూస్తుంటే మిరాయ్, ఓజీని పోలి ఉండేట్లు అనిపిస్తుంది. https://cinemaabazar.com/
ఈ పోలికను హీరో తేజ సజ్జ కూడా ఒప్పుకున్నాడు. మిరాయ్ అనే సూపర్ యోధా టైటిల్ ను టాలీవుడ్ లో ఏ హీరోకైనా ఇవ్వాలంటే నేను పవన్ కళ్యాణ్ గారికి ఇస్తానన్నట్లు చెప్పుకొచ్చాడు. ఓజీ గ్లింప్స్ లో పవన్ కత్తి పట్టి తిప్పడం, ఆ టైటిల్ ఫాంట్ మిరాయ్ కు దగ్గరగా ఉంటాయని, కానీ సినిమాలు మాత్రం విభిన్నంగా ఉంటాయని తేజ చెప్తున్నాడు. ఇదిలా ఉంటే మిరాయ్ సినిమాలో తేజ సజ్జ మరోసారి సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. https://cinemaabazar.com/