సినిమా సంగీత రూపకల్పన కోసం విశాఖలోని భీమిలో రికార్డింగ్ స్టూడియోను నిర్మిస్తానని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ ప్రకటించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెయింట్ లూక్స్ సంస్థ సహకారంతో నూతనంగా నిర్మించిన ఆడియో రికార్డింగ్ స్టూడియో, తరగతి గదులను థమన్ ప్రారంభించాడు. ఏపీని మ్యూజిక్ ల్యాండ్ గా భావిస్తానని, విశాఖ కేంద్రంగా సినీ సంగీత ప్రయాణానికి ఇదో మంచి ఆరంభంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తనకు దేశ, విదేశాల్లో స్టూడియోలు వున్నాయని, త్వరలోనే విశాఖలో కూడా స్టూడియో నిర్మిస్తానని ప్రకటించారు. అయితే.. తన రిటైర్డ్ లైఫ్ మాత్రం విశాఖలో గడిపేందుకు ఇష్టపడతానని వెల్లడించాడు. మరో వైపు ఏయూ ఆడియో ఇంజనీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ ను ప్రారంభించారు.