తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం సచివాలయంలోని 6 వ అంతస్తులోని తన ఛాంబర్ కి వెళ్లి, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ తొలి సంతకం చేశారు. ఇలా మొత్తం 6 ఫైళ్లపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. పోడు భూముల పంపిణీ, నగరంలో లక్ష బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, గ్రుహ లక్ష్మీ సహా పలు ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు. అనంతరం సమయంలో సీఎం కేసీఆర్కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అంతకు ముందు ఎలక్ట్రిక్ వాహనంలో పలు ఛాంబర్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, తదితరులు సీఎం ని అభినందించారు.
ఇక… రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తమకు కేటాయించిన ఛాంబర్లలో ప్రత్యేక పూజలు చేసి, తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రులకు, వారి కుటుంబీకులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పలు దస్త్రాలపై సీఎం కేసీఆర్, మంత్రులు సంతకాలు చేశారు.
సీఎం కేసీఆర్ – కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రం
కేటీఆర్ – జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూంల కేటాయింపు మార్గదర్శకాలు
హరీష్ రావు – టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ దస్త్రం
తలసాని శ్రీనివాస్ యాదవ్ – ఉచిత చేప పిల్లలు, గొర్రెల పంపిణీ దస్త్రం
నిరంజన్ రెడ్డి – సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా దస్త్రం
గంగుల కమలాకర్ – ఐసీడీఎస్ పథకంలో భాగంగా అంగన్వాడీలకు మే నెల నుంచి పోషకాల సన్నబియ్యం అందించే దస్త్రం
కొప్పుల ఈశ్వర్ – దళిత బంధు రెండో విడత దస్త్రం
ఇంద్రకరణ్ రెడ్డి – జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాలయాల్లో దూపదీప నైవేద్య ప్రారంభం దస్త్రం
జగదీశ్ రెడ్డి – వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ దస్త్రం
సబితా ఇంద్రారెడ్డి – ట్యాబ్లు, లైబ్రరీ కార్నర్ దస్త్రం
సత్యవతి రాథోడ్ – రాంజీ గోండు మ్యూజియానికి రూ. 10 కోట్ల కేటాయింపు దస్త్రం
శ్రీనివాస్ గౌడ్ – సీఎం కప్ నిర్వహణకు రూ. 3.2 కోట్ల మంజూరు దస్త్రం
మహమూద్ అలీ – కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరు దస్త్రం
వేముల ప్రశాంత్ రెడ్డి – రోడ్లు భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ దస్త్రం
మల్లారెడ్డి – శ్రమ శక్తి అవార్డుల దస్త్రం
దయాకర్ రావు – ఐకేపీ గ్రూపులకు మండలాల వారీగా కొత్త భవనాల దస్త్రం