తెలంగాణలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు శివాలయాలకి వెళ్లి, పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచే దర్శనాల కోసం క్యూలైన్లో నిలుచున్నారు. తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… అధికారులు అన్ని చర్యలూ తీసుకున్నారు. వేములవాడ, ఏడుపాయలతో సహా… అన్ని శైవ క్షేత్రాల్లో మహా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఏడుపాయలను సందర్శించారు.
అక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శశoగా నిలుస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడుపాయలకు ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు.