పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బండి సంజయ్ కి బెయిల్ ఇవ్వాలని కోరుతూ హనుమకొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద బండి సంజయ్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి… బండి సంజయ్ కి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.

 

మరోవైపు 20 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. అయితే… విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 6 తేదీన హనుమకొండ కోర్టులో సంజయ్ బెయిల్ పిటిషన్ పై దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. అయితే.. బండి సంజయ్ కి బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారని, ఆయన్ను విచారించాల్సి వుందని పోలీసులు వాదనలు వినిపించారు. మరోవైపు ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ కోర్టులో వున్నారు. శుక్రవారం ఉదయం జైలు నుంచి విడుదల కానున్నారు.