జస్ట్ ఎ మినిట్ మూవీ రివ్యూ

చిత్రం: జస్ట్ ఎ మినిట్
విడుదల తేదీ: 19-07-2023
నిడివి: 1 గం 52 ని లు
CBFC రేటింగ్: A
నటీనటులు : అభిషేక్ పచ్చిపాల, ఇషిత సింగ్, వినీషా, నజియా ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి
దర్శకత్వం: యశ్వంత్
నిర్మాణం : రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్
నిర్మాతలు : రెడ్ స్పైన్ ఎంటర్టైన్మెంట్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి
అసోసియేట్ డైరెక్టర్ : కార్తీక్ ధర్మపురి
ఎడిటర్ : దుర్గ నరసింహ
సినిమాటోగ్రాఫర్ : అమీర్
మ్యూజిక్ : ఎస్. కే. బాజీ
మ్యూజిక్ లేబుల్ : మధుర ఆడియో
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు VR

ఏడు చేపల కథ సినిమా ఫేం అభిషేక్ పచ్చిపాల హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, కార్తీక్ ధర్మపురి సమర్పించు సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా తన్వీర్ మరియు ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా యశ్వంత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా జస్ట్ ఎ మినిట్. ఎడిటర్ గా దుర్గ నరసింహ, డిఓపి గా సమీర్ మరియు ఎస్. కె. బాజీ మ్యూజిక్ అందించారు. కార్తీక్ ధర్మపురి ప్రొడ్యూసర్ గా ఉండి ఈ సినిమాలో నటించారు కూడా. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జూలై 19న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ :

చెప్పుకోలేని ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న రవి (అభిషేక్ పచ్చిపాల). ఆ ప్రాబ్లెమ్ నుంచి బయటపడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అలా చేసే ప్రయత్నంలో తనకు పరిచయమైన పూజ (నజియా ఖాన్) తో తొలిచూపులోనే లవ్ లో పడతాడు. తన సమస్య తన స్నేహితుడైన రాంబాబు (జబర్దస్త్ ఫణి) కి తెలుసు. రాంబాబు హెల్ప్ తో ఆ సమస్యను ఎదుర్కోవడం కోసం చేసే ప్రయత్నం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఇంతకీ రవికి ఉన్న సమస్య ఏంటి? చివరికి సమస్యను అధిగమించాడా? లేదా? రవికి పూజ ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :

అభిషేక్ పచ్చిపాల తనకున్న సమస్యని కామెడీగా చూపించడంలో మంచి యాక్టింగ్ కనబరిచారు. మంచి కామెడీ టైమింగ్ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. హీరోయిన్ నజియా ఖాన్ పెర్ఫార్మెన్స్ తో పాటూ, గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. జబర్దస్త్ ఫణి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కామెడీ మరి ఎమోషన్ ని చాలా బాగా పండించారు. సారిపల్లి సతీష్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. కార్తీక్ ధర్మపురి ప్రొడ్యూసర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యుండి కూడా ఒక మంచి పాత్రలో సినిమాకి మంచి సపోర్ట్ గా నిలబడ్డారు. అలాగే ఈ చిత్రంలో పోలీస్ పాత్రలు కామెడీని బాగా పండించారు. మిగిలిన క్యారెక్టర్స్ వారి పరిధి మేరకు మెప్పించారు.

విశ్లేషణ:

యశ్వంత్ మొదటిసారి దర్శకత్వం చేస్తున్నా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడిగా ఈ కథను డీల్ చేసాడు. ప్రస్తుతం సమాజంలో చాలా మంది యువకులు ఫేస్ చేస్తున్న సమస్యను కథను తీసుకొని, దాన్ని ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తెరకెక్కించాడు. సినిమాలో కామెడీని ఏ మోతాదులో ఎక్కడా వాడాలో అక్కడ వాడాడు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు శృతి మించినా.. కథలో భాగంగానే తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అభిషేక్, జబర్దస్త్ ఫణి మధ్య డైలాగ్స్, కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయి. తక్కువ నిడివి ఉండడం కూడా సినిమాకి ఆకర్షణగా నిలిచింది. ఓవరాల్ ఈ సినిమా యూత్ ను ఆకట్టుకునే మెసేజ్ తో రూపొందించారు. ప్రెజెంట్ యూత్ చెప్పుకోలేని సమస్యల్ని ఎలా ఎదుర్కొంటున్నారనేది దర్శకుడు ఈ సినిమాలో చాలా బాగా చూపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు :

రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ మరియు సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా తన్వీర్ మరియు ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చిత్రాన్ని నిర్మించారు. తన్వీర్ నిర్మాత గానే కాకుండా లిరిక్ రైటర్ గా మరియు కథ, డైలాగ్స్ లో కూడా మంచి ప్రతిభ కనబరిచారు. ఎస్.కె. బాజీ అందించడం మ్యూజిక్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. యశ్వంత్ మొదటిసారి దర్శకత్వం చేస్తున్న మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడిగా ఫ్రేమ్స్ మరియు టేకింగ్ లో చాలా బాగా దర్శకత్వం వహించాడు. దుర్గ నరసింహ ఎడిటింగ్ వర్క్ మరియు సమీర్ సినిమాటోగ్రఫీ పనితీరు మెప్పించాయి.

రేటింగ్ : 2.75/5
చివరగా: యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ

Related Posts

Latest News Updates