మెగాస్టార్ చిరంజీవి బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఇటీవల ఆయన టయోటా వెల్ఫైర్ కారు కొనగా.. ఆ వెహికల్ రిజిస్ర్టేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చి ఫొటో దిగి, డిజిటల్ సైన్ చేశారు. రూ.4.70 లక్షలకు టీఎస్ 09జీబీ 1111 నంబర్‌ను కొనుగోలు చేశారు. చిరంజీవి కొన్న కొత్త కారు ధర సుమారు రూ.కోటికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.టయోటా కంపెనీ నుంచి విడుదలైన కొత్త మోడల్ కారును కొనుగోలు చేశారు. దీని మార్కెట్ ధర కోటి 30 లక్షల రూపాయల వరకు ఉంది. అన్నీ ఫీచర్స్, ఇంటీరియర్ కలుపుకుంటే మరో 20 లక్షలు వున్నట్లు తెలుస్తోంది. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసమే ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. డబుల్ వన్.. డబుల్ 11.. నాలుగు ఒకట్ల ఫ్యాన్స్ నెంబర్ కోసం 4 లక్షల 70 వేల రూపాయలు చెల్లించారు చిరంజీవి.













