మంత్రి తలసాని సోదరులకు ఈడీ ఝలక్ ఇచ్చింది. చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో తలసాని సోదరులు ధర్మేంద్ర యాదవ్, మహేశ్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. దాదాపు 4 నెలల తర్వాత ఈడీ మళ్లీ దీనిపై విచారణ ప్రారంభించింది. ఇవ్వాళ మధ్యాహ్నం నుంచి ఈడీ తలసాని సోదరులను ప్రశ్నిస్తోంది. వీరిద్దరూ క్యాసినో వ్యవహారంలోనే విదేశాలకు వెళ్లినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ సమయంలో అసలు నిబంధనలు పాటించారా? లేదా? అన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.