బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ సంస్థలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. 20 మంది అధికారులు మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేస్తున్నారు. అయితే.. కోమటిరెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి ఈ సంస్థకు ఎండీగా వున్నాడు. కేవలం సంస్థ కార్యాలయంలోనే కాకుండా ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లపై కూడా జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో ఈ సంస్థ నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని టీఆర్ఎస్ ఆరోపించింది. ఆ లావాదేవీలు సుశీ ఇన్ ఫ్రా నుంచి జరిగాయని ఈసీ తేల్చింది. అందుకే జీఎస్టీ అధికారులు ఈ సంస్థపై సోదాలు చేసినట్లు తెలుస్తోంది.