ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల తేదీలో మార్పులు

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల తేదీని మారుస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18 న జరగాల్సి వుంది. అయితే… పాలనాపరమైన కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వచ్చే యేడాది జనవరి 8 న నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్ తెలిపారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ నెలాఖరులో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 92 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేసేందుకు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 5 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు.

Related Posts

Latest News Updates