ఏకనాథ్ షిండేదే అసలైన శివసేన అని ప్రకటించిన ఈసీ… ఉద్ధవ్ కి ఝలక్

మహారాష్ట్ర రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసేకుంది. ఏకనాథ్ షిండే వర్గానికే సిసలైన శివసేన అని ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతేకాకుండా శివసేన ఆవిర్భావం నుంచీ కొనసాగుతున్న ఎన్నికల గుర్తు విల్లు -బాణం కూడా శిందే వర్గానిదే అని తేల్చి చెప్పింది. 78 పేజీలతో కూడిన ఆదేశాలను ఈ మేరకు త్రిసభ్య కమిషన్ విడుదల చేసింది. దీంతో ఉద్ధవ్ వర్గానికి భారీ ఝలక్ తగిలింది. దీంతో 8 నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది.

మహా వికాస్ అగాఢీని వ్యతిరేకిస్తూ గత జూన్ మాసంలో కొందరు ఎమ్మెల్యేలతో ఏకనాథ్ షిండే శివసేన నుంచి బయటకి వచ్చేశారు. అంతేకాకుండా తన సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతున్నారు. అయితే… ఈ సమయంలోనే తమదే అసలైన శివసేన అంటూ అటు షిండే, ఇటు ఉద్ధవ్ పోరాటానికి దిగారు. దీంతో ఇద్దరూ న్యాయపోరాటానికి సిద్ధమైపోయారు. ఇద్దరూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో ఈసీ త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇరు వర్గాల వాదోపవాదాలను పరిగణనలోకి తీసుకుంది. చివరకు శివసేన షిండే వర్గానిదే అని ప్రకటించింది.

ప్రస్తుత శివసేన రాజ్యాంగం అప్రజాస్వామికమని ఈసీ పేర్కొంది. ఎలాంటి ఎన్నికలు లేకుండా ప్రజాస్వామికంగా కోటరీకి చెందిన వ్యక్తులను ఆఫీస్ బేరర్లుగా నియమించడం సరికాదని అభిప్రాయపడింది. అటువంటి పార్టీ నిర్మాణాలు విశ్వాసాన్ని ప్రేరేపించడంలో విఫలమవుతాయని పేర్కొంది. 2018లో శివసేన పార్టీ రాజ్యాంగాన్ని ఎన్నికల కమిషన్ కు ఇవ్వలేదు. 1999లో అప్పటి శివసేన చీఫ్ బాలా సాహెబ్ ఠాక్రే తీసుకువచ్చిన రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలను ఉల్లంఘిస్తున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది.

 

Related Posts

Latest News Updates