కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై నటుడు నరేష్ తీవ్రంగా మండిపడ్డారు. తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు కొన్ని ఆధారాలు సమర్పించారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తమ గురించి ఎంత తప్పుగా ప్రసారం చేశాయో చూపించారు. ఇదే విషయంపై కోర్టులో కూడా కేసు వేస్తానని ప్రకటించారు. పనిగట్టుకొని మరీ తమపై ట్రోల్ చేస్తున్నాయన్నారు. తన లైఫ్ లోకి వచ్చిన పవిత్ర లోకేశ్ విషయంలో ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు.
గత ఏడాది నవంబర్ 27వ తేదీన మొదట నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేశారు. పలు వెబ్ సైట్స్ అలాగే యూట్యూబ్ ఛానల్ పై కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 15 యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్స్ కు ఇదివరకే నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ట్రోల్స్ పై కూడా ఆయన సీరియస్ అవుతూ పోలీసులను ఆశ్రయించారు. ఇక కొన్ని వారాల క్రితం నరేష్ తన మాజీ భార్య రమ్య రఘుపతి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది అని తనపై దాడి చేసేందుకు కూడా ఆమె ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన కొన్ని వీడియోలు విడుదల చేశారు.