మంచు విష్ణు తాజాగా జిన్నా సినిమాతో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా జిన్నాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. జిన్నా ఫస్ట్ సింగిల్ గోలీసోడా పోస్టర్ వచ్చింది. ఇందులో మంచు విష్ణు చూట్టు చాలా మంది అమ్మాయిలున్నారు. ఇక ఈ పాట మాత్రం మాస్ స్టెప్పులతో అదిరిపోయేలా ఉండబోతోన్నాయనిపిస్తోంది. మొత్తానికి ఈ పోస్టర్ మాత్రం ఇప్పుడు నెటిజన్లకు మరో ట్రోలింగ్ సాధనంలా మారింది. మంచు విష్ణు జిన్నా సినిమా మీద ఇప్పుడు మంచి హైప్ ఏర్పడింది. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సమయం నుంచీ ఏదో ఒక కాంట్రవర్సీతో జిన్నా పేరు మార్మోగిపోతూనే ఉంది. ఈ సారి జిన్నా సినిమాతో మంచు విష్ణు బాగానే సందడి చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు విష్ణు సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. జిన్నా పోస్టర్లు, వీడియోలు నెట్టింట్లో ఎంతగా ట్రోలింగ్‌కు గురవుతున్నాయో అందరికీ తెలిసిందే. మామూలుగానే మంచు విష్ణు ఏ ట్వీట్ వేసినా కూడా కౌంటర్లు పడుతుంటాయి. అందరూ ట్రోలింగ్ చేస్తుంటారు. మంచు విష్ణు పోస్ట్ వేస్తే ఆ రోజు పెద్ద చర్చ జరగాల్సిందే అన్నట్టుగా మారుతుంది. ఇక ఇప్పుడు గోలీసోడా అంటూ జిన్నా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. జిన్నా సినిమా నుంచి మొదటి పాట అయిన గోలీసోడాను రిలీజ్ చేయబోతోన్నారు. సెప్టెంబర్ 19న గోలీసోడా పాటను రిలీజ్ చేయబోతోన్నారట. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చుట్టూ అమ్మాయిలే ఉన్నారు. చూస్తుంటే ఈ పాటలో ఇంత మంది అమ్మాయిలతో విష్ణు డ్యాన్స్‌లతో కుమ్మేసేలా ఉన్నాడు. ఇక పాయల్ రాజ్‌పుత్, విష్ణుల కాంబినేషన్‌కు జనాలు ఫిదా అయ్యేలా కనిపిస్తోంది. జిన్నా తరువాత మంచు విష్ణు తన ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్టు కనిపిస్తోంది. శ్రీను వైట్లతో ఢీ 2 డబుల్ డోస్ అనే చిత్రం చేస్తానని ఇది వరకే ప్రకటించాడు. మరి ఇంత వరకు మళ్లీ అప్డేట్ ఇవ్వలేదు. మొత్తానికి తన చిత్రాలు తానే నిర్మించుకుంటూ మంచు విష్ణు ఫుల్ బిజీగా మారిపోయాడు. మరోవైపు మా ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.