తన పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. సీఎం కేసీఆర్ ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తున్నారని, టీఆర్ఎస్ అక్రమాలను, అవినీతిని ప్రశ్నించినందుకే తమను నిర్బంధాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బాధితుల మీదే కేసులు పెట్టి వేధిస్తున్నారని, వైఎస్సార్టీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాడానికి ఏవీ కారణాలు లేవని, అయినా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.

 

తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారన్నారు. తామే బాధితులమని, అయినా… తమపైనే తెలంగాణ పోలీసులు కేసులు పెడుతున్నారని షర్మిల మండిపడ్డారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదన్నారు. తెలంగాణను దోచుకోవడం అయిపోయింది కాబట్టే దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరారని విమర్శించారు.