TSPSC పేపర్ లీకేజీని నిరసిస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ TSPSC కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసిTSPSC ముట్టడికి యత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.

పేపర్ లీక్ ఘటనపై మాట్లాడిన షర్మిల.. తనేమీ క్రిమినల్ కాదని, అయినా, పోలీసులు తనకు లుక్ అవుట్ నోటీసులు ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో దర్నాలు చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. పేపర్ లీక్ కేసులో పెద్దవాళ్లను తప్పిస్తున్నారని, చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారని, ప్రజాస్వామ్యపరంగా నిరసనలు చేయనీయకుండా గొంతు నొక్కేస్తున్నారని షర్మిల విమర్శించారు. తాను బయటకు వెళ్లాలంటేనే ఇతర కారణాలు చూపించి హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.