అధికార వైసీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. శుక్రవారం రాత్రి కొందరు వైసీపీ ఖాతాను హ్యాక్ చేశారు. శుక్రవారం నుంచే వైసీపీకి సంబంధం లేని పోస్టులు, వ్యతిరేక పోస్టులు రావడం ప్రారంభమైంది. అసలు వైసీపీకి సంబంధం లేని పోస్టులను అందులో గమనించారు.

అంతేకాకుండా ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్, అకౌంట్ వివరాలను కూడా మార్చేశారు. జంతువుకు సంబంధించిన మొహానికి సంబంధించిన ఫొటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టారు. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట వున్న ట్విట్టర్ ఖాతాలో సీఎం జగన్ ప్రసంగాలు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వస్తూ వుంటాయి.












