ఓ ఛానెల్ పెడతా… రియల్ ఎస్టేట్ లోకీ దిగుతా… సంచలన ప్రకటన చేసిన విజయసాయి రెడ్డి

విశాఖపట్నంలో తనకు ఒకే ఒక ఫ్లాట్ వుందని, అంతకు మించి తనకు ఆస్తులు లేవని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ భూములపై తాను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని, సీబీఐ, ఈడీ, ఎఫ్బీఐ విచారణకు తాను సిద్ధంగా వున్నానని స్పష్టం చేశారు. తన కుమార్తె అత్తింటి కుటుంబం 40 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో వున్నారని, తన వియ్యంకుడు కుటుంబం ఆస్తులు కొనుగోలు చేస్తే తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కాకూడదన్న దురుద్దేశంతోనే విశాఖలో భూములను ఆక్రమించారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చేతిలో పత్రిక, టీవీ చానల్‌ ఉందని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని, అందుకే నేను కూడా మీడియా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. త్వరలో టీవీ చానల్‌ పెడతాను. అవసరమైతే పత్రిక కూడా పెడతాను. నన్ను విశాఖలో అప్రతిష్ఠ పాల్జేస్తున్న వారి సంగతి తేల్చడానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి కూడా వస్తాను’’

 

 

సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడే దసపల్ల భూములు 22ఏ నుంచి తొలగించాల్సిన అవసరం వచ్చిందన్నారు. విశాఖలో భూములన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలో వున్నాయని మండిపడ్డారు. దసపల్లా పై బాబు నిర్ణయం తీసుకోకపోవడం ఆయన వైఫల్యమని చంద్రబాబుపై మండిపడ్డారు. దసపల్లా భూముల్లో ఉంటున్న 400 కుటుంబాలకు న్యాయం చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అది ప్రైవేటు భూమి అని సుప్రీంకోర్టు చెప్పినందున ప్రభుత్వ భూముల జాబితా 22-ఏలో ఉంచడం సరికాదు. ఇప్పుడు ఈ నిర్ణయంవల్ల లబ్ధి పొందేవారిలో అత్యధికులు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే అని వ్యాఖ్యానించారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం