నా కుమారుడు ఎలాంటి తప్పూ చేయలేదు : మాగుంట శ్రీనివాసులు రెడ్డి

తన కుమారుడు రాఘవరెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తమ కుటుంబం 70 సంవత్సరాలుగా వ్యాపారంలో వుందని, 10 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని తెలిపారు. తనకు 50 ఏళ్ల అనుభవం వుందని, ఎక్కడా తప్పు చేయలేదన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మాగుంట రాఘవరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసులు రెడ్డి పై విధంగా స్పందించారు.

 

ఢిల్లీలో తాము ఏ తప్పు చేయలేదని మాగుంట స్పష్టం చేశారు. తన కుమారుడ్నిన కోర్టులో కలిసినప్పుడు, పెదనాన్న సుబ్బరామిరెడ్డి పేరుకు అప్రతిష్ట పాలు చేయబోనని.. తనకు తలవంపులు వచ్చే పని కూడా చేయనని కుమారుడు చెప్పాడన్నారు. తన కుమారుడు మీద నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. రాఘవ ధైర్యంగా ఉన్నాడని.. తమను కూడా ధైర్యంగా ఉండమని చెప్పాడని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 32 సంవత్సరాలు అవుతోందనియ.. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు.

 

ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత..మాజీ మంత్రి బాలినేని ఒంగోలులో మాగుంటను కలిసారు. మాగుంట కుటుంబం ప్రజా సేవలో ముందుందని..అటువంటి వారి పైన రాజకీయ కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎవరితోనూ మాగుంటకు వివాదాలు లేవన్నారు. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయనదని చెప్పుకొచ్చారు. రాజకీయంగా మాగుంట కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఆయన కుమారుడిని అరెస్ట్ చేయటం సరి కాదని బాలినేని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కోరిన 10 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. సౌత్ గ్రూప్ తరఫున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది.

Related Posts

Latest News Updates