ఇవే తనకు ఆఖరి ఎన్నికలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అనడంపై అధికార వైసీపీ స్పందించింది. అవే మాటలు గనక చంద్రబాబు అని వుంటే తథాస్తు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అదృష్టం బావుండి అన్ని సార్లు సీఎం అయ్యారన్నారు. ఆయన అనుకున్నంత పరిపాలన దక్షుడు కాదని బొత్స పేర్కొన్నారు. ఇక.. చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, ఆయనకు ప్రజలు మూడు సార్లు అవకాశమిస్తే.. ప్రజలను మోసం చేశారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు కోరుకున్నట్లు ప్రజలు కూడా తీర్పునిస్తారని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటున్నారని బొత్స పేర్కొన్నారు.
ఇక ఇదే విషయంలో ఎంపీ విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. మూడుసార్లు సీఎంను చేస్తే ఏం చేశావంటూ చంద్రబాబును ప్రశ్నించారు. చివరి ఛాన్స్ అంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డారని మండిపడ్డారు. కుల పిచ్చితో మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఇక జన్మకి సీఎం కాలేరని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. చంద్రబాబు క్షుద్ర విద్యలు నేర్చిన నాగుపాము అని, భూముల్ని కబళించే కాలనాగు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.












