కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి సీఎం జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని 2 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితిని పెంచాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థుల వినతులపై సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా 2 సంవత్సరాల పాటు వయోపరిమితిని పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీ సర్కార్ 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టింది. వాటిలో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులున్నాయి.












