బాలీవుడ్ ప్రముఖులతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముంబైలో భేటీ అయ్యారు. యూపీలో వెబ్ సిరీస్ తీస్తే 50 శాతం, ఫిల్మ్ ల్యాబ్, స్టూడియోలు స్థాపిస్తే 25 శాతం సబ్సిడీ ఇస్తామని ఈ సందర్బంగా సీఎం యోగి బాలీవుడ్ ప్రముఖులకు హామీ ఇచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే యూపీ గుర్తుకు వచ్చేలా చేయాలన్నారు. సినీ పరిశ్రమకి సంబంధించిన ఇద్దర్ని తమ రాష్ట్రం నుంచి ఎంపీలుగా చేశామని, అలాగే.. సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా తమకు తెలుసన్నారు.

యూపీ అనేది చలన చిత్ర పరిశ్రమకు అనుకూల రాష్ట్రమని వివరించారు. యూపీలోని లక్నోలో ంచ్చే నెలలో పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రోత్సహించేందుకు సీఎ యోగి ముంబైలో పర్యటిస్తూ.. బాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. సమాజాన్ని ఏకం చేయడం, దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో సినిమీ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.












