గన్నవరంలో టెన్షన్ టెన్షన్… టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ వర్గీయుల దాడి

మరోసారి గన్నవరం రణరంగంగా మారిపోయింది. ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి, దొరికిన వారిని కూడా బాదారు. దీంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు, నేతలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అలాగే టీడీపీ కార్యాలయం ఆవరణలో వున్న కారుపై పెట్రోల్ పోసి, వంశీ వర్గీయులు నిప్పంటించారు. అయితే… ఇది ఆరంభం మాత్రమేనని, వంశీని విమర్శిస్తే మరింత దాడులు చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారని టీడీపీ ఆరోపించింది.

అయితే… వల్లభనేని వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు బయల్దేరారు. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేవారు. దీంతో వైసీపీ వర్గీయులకు, టీడీపీ వర్గీయులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. అది కాస్త తీవ్ర ఘర్షణకే దారితీసింది. ఆ తర్వాత వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడులు చేయడం, ఫర్నీచర్ ధ్వంసం చేయడం జరిగిపోయింది. అంతేకాకుండా కార్యాలయం ముందున్న ఓ కారుకు కూడా నిప్పు పెట్టేశారు. దాదాపు 50 మంది వంశీ వర్గీయులు వచ్చి టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు.

కొన్ని రోజులుగా టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు, లోకేశ్ ను అగౌరవపరిచేలా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతున్నారంటూ టీడీపీ సీనియర్ నేత పట్టాభి కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా కూడా వున్నారు. వీరిద్దరూ ఎమ్మెల్యే వంశీపై విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు, వంశీ వర్గీయులు తమపై దాడికి దిగారని టీడీపీ పేర్కొంది.

 

మరోవైపు తన భర్త కనిపించడం లేదని టీడీపీ నేత పట్టాభి భార్య చందన పేర్కొంటున్నారు. ఎవరు ఎత్తుకెళ్లారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తన భర్త ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే డీజీపీ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ప్రజల తరపున తన భర్త మాట్లాడారని, అంత మాత్రాన కేసులు పెట్టేస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే తన భర్త ఆచూకీని తెలపాలని డిమాండ్ చేశారు.

Related Posts

Latest News Updates