వైఎస్ జగన్ ”ప్రజా సంకల్ప యాత్ర” పూర్తై.. 4 సంవత్సరాలు పూర్తి… వైసీపీ ఆఫీసులో సంబరాలు

వైసీపీ అధినేతగా వున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తై నేటికి సరిగ్గా 4 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, వైసీపీ ఎంపీలు హాజరయ్యారు. పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు జగన్ తన మేనిఫెస్టోలో పొందుపరిచారని, ఇప్పటి వరకూ 98 శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి చేశారని సజ్జల అన్నారు. ప్రజలకు ఏమి కావాలో తెలిసిన ఏకైక నేత జగన్ అని చెప్పుకొచ్చారు. వైసీపీ అంటే దేశంలోనే విలక్షణ పార్టీ అని, ప్రజల నమ్మకాన్ని జగన్ ఏనాడూ వమ్ము చేయలేదన్నారు.

 

2024 లో షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని, కానీ.. మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ముందస్తును కోరుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఇక…. తాజాగా జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్- చంద్రబాబు తమ అక్రమ సంబంధాన్ని పవిత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు కానీ… చావుకు కారణం అయిన వారిని పరామర్శించడం ఏంటని సజ్జల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కిందా మీదా పడి బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు.

Related Posts

Latest News Updates