ఆరెస్సెస్ నేతలకు వై కేటగిరి భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు

నిషేధిత పీఎఫ్ఐ సంస్థ నుంచి కేరళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులకు ప్రమాదం పొంచి వుందన్న విషయాన్ని గ్రహించిన కేంద్రం అప్రమత్తమైంది. పీఎఫ్ఐ కేరళలోని కొందరు ఆరెస్సెస్ నేతలను టార్గెట్ చేసుకొని, విరుచుకుపడే అవకాశాలున్నాయని రిపోర్టులు రావడంతో వారికి వై కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. కేరళలోని 5 మంది ఆరెస్సెస్ నేతలకు వై భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ పేర్కొంది.

 

ఈ వారంలో ఇస్లామిక్ సంస్థపై ఇటీవల ఎన్ఐఏ దాడులు చేసిన సందర్భంగా కొన్ని పత్రాలు దొరికాయి. అందులో ఆరెస్సెస్ కీలక నేత పేర్లు వున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. కేరళ పీఎఫ్ఐ సభ్యుడు మహమ్మద్ బషీర్ ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటీవల జరిపిన దాడుల్లో వారి హిట్ లిస్టుల్లో ఐదుగురు ఆర్ఎస్ఎస్ నాయకులున్నారని ఆ విషయాన్ని తాము కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అందించామని ఎన్ఐఏ పేర్కొంది. దీంతో కేరళలోని 5 గురు ఆరెస్సెస్ సభ్యులకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Related Posts

Latest News Updates