ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర సతీమణి కె. రామలక్ష్మి శుక్రవారం కన్నుమూశారు. వయోభారంతోనే కన్నుమూశారని కుటుంబీకులు పేర్కొన్నారు. 1954 లో కవి ఆరుద్రతో ఈమెకు వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. 1930 డిసెంబర్ 31 న కోటనందూరులో రామలక్ష్మి జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా సాధించి, 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యంపై అపారంగా పట్టు సంపాదించారు. రామలక్ష్మి ఆరుద్ర కలం పేరుతో ఈమె రచనలు చేశారు.