ఈ నెల 26 నుంచి అందుబాటులోకి రానున్న కరోనా ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కొవాక్‌

కరోనా ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కొవాక్‌.. ఈ నెల 26 నుంచి అందుబాటులోకి వస్తుందని సంస్థ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో జరిగిన కార్యక్రమంలో నాసికా వ్యాక్సిన్‌ను గణతంత్ర దినోత్సవం రోజున అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ ప్రపంచంలోనే మొట్టమొదటిగా రికార్డులో చేర‌నుంది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రాథమిక 2 డోస్‌ షెడ్యూల్‌, హెటెరోలాగస్‌ బూస్టర్‌ డోస్‌కు ఆమోదం పొందేందుకు సంస్థకు ఆమోదం లభించింది.

 

అంతకు ముందు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ), 18 ఏళ్లు లేదా అంతకంటే పైబడిన వయసున్న వారిలో అత్యవసర పరిస్థితుల్లో ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ను తీసుకోడానికి ఆమోదించింది. ఒక్కో మోతాదుకు 325 రూపాయలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు ఆస్పత్రులు, వాక్సిన్‌ కేంద్రాలు 800 రూపాయలు (జీఎస్టీ అదనం) చెల్లించాలి.

Related Posts

Latest News Updates