”జూలైలో విశాఖ వెళ్దాం… రెడీగా వుండండి”… మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

విశాఖ నుంచి పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుందో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేవారు. జూలై నెలలో విశాఖకు వెళ్తున్నామని, మంత్రులందరూ సిద్ధంగా వుండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖే తమ పరిపాలన రాజధాని అని సీఎం జగన్ పలు మార్లు కీలక ప్రకటనలు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన పారిశ్రామిక సదస్సులోనూ ప్రకటించారు. అయితే… ఎప్పటి నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందో మాత్రం ప్రకటించలేదు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ విశాఖపై ప్రకటన చేశారు. జూలైలో విశాఖ వెళ్తున్నామని, అందరూ సిద్ధంగా వుండాలని సీఎం జగన్ మంత్రులతో అన్నారు. దీంతో విశాఖ షిఫ్ట్ కావడంపై క్లారిటీ వచ్చేసింది.

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. 45 అంశాలను ఎజెండా చేసుకొని, చర్చించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా నూతన పారిశ్రామిక విధానానికి ఓకే చెప్పింది. మొదట ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ తర్వాత జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.

Related Posts

Latest News Updates