అవినీతిపరులను రక్షించేందుకు రాజకీయ పక్షాలు ఏకమవుతున్నాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఘాటుగా స్పందించారు. గతంలో తాను వాజ్‌పేయితో కూడా కలిసి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వాజ్‌పేయీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభిచిందన్నారు. కేంద్రంలో ఉన్నవారిని మాట్లాడనీయండి. నాకెలాంటి బాధ లేదు అని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులను, ప్రభుత్వాలు మార్చడానికి యత్నించడాన్ని ఆయన తపుపట్టారు. ఎవరైనా అవినీతిపరులను ఎందుకు కాపాడుతారు? వారి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే తీరేంటి. దాని గురించి వారెందుకు మాట్లాడరు. మేం ఏ అవినీతిపరుడిని సహించం. వారేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పొచ్చు. స్పందించాల్సి అవసరం నాకు లేదు అని అన్నారు