పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన సలార్1 ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. పేరుకే సలార్ లో శృతి హీరోయిన్ తప్పించి ఆ సినిమాలో ఆమె పాత్రకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేదు.శృతి హాసన్ లాంటి స్టార్ హీరోయిన్ సలార్ లో ఇలా ప్రాధాన్యత లేని గెస్ట్ రోల్ చేయాల్సిన అవసరమేంటని ఆ టైమ్ లో అందరూ ప్రశ్నించారు. వారందరికీ శృతి ఆన్సర్ ఇచ్చింది. సలార్ లో తన పాత్ర చిన్నదని ఒప్పుకున్న శృతి హాసన్, సలార్ సూపర్ హిట్ అవుతుందని భావించానని, అలాంటి సినిమాను తానెందుకు వదులుకుంటానని ప్రశ్నించింది.
గతంలో తాను ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా నిరాశ పరిస్తే, చిన్న పాత్రలు చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. అందుకే నిడివి విషయాన్ని తాను లెక్కలోకి తీసుకోనని శృతి చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం సలార్2లో శృతి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.