భద్రతా సిబ్బంది ఏదో చెప్పారు… ఉన్న ఫళంగా సదస్సు నుంచి వెళ్లిపోయిన బ్రిటన్ ప్రధాని సునాక్

ఈజిప్టు వేదికగా జరుగుతున్న వాతావరణ సదస్సు కాప్ 27 నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తోంది. ఇలా రుషి హఠాత్తుగా సమావేశం నుంచి నిష్క్రమించడంతో సమావేశ సభ్యులంతా తీవ్ర గందరగోళానికి గురయ్యారు. బ్రిటన్ ప్రధాని రిషి వేదికపై కూర్చొని, సదస్సును వింటున్న సమయంలో ఆయన సిబ్బంది ఒకరు వచ్చి చెవిలో ఏదో చెప్పారు. దీని గురించి ఇద్దరు అక్కడే కూర్చుని మాట్లాడుకున్నారు. మొదట వచ్చిన సిబ్బంది వెళ్లిపోయారు.

 

కాసేపటికే మరో వ్యక్తి ప్రధాని రిషి దగ్గరికి వచ్చి… చెవిలో ఏదో చెప్పాడు. ఇది జరగగానే ప్రధాని రిషి సునాక్ కాప్ 27 నుంచి నిష్క్రమించారు. అయితే.. ప్రధాని సిబ్బంది ఆయన చెవిలో ఏం చెప్పారు? రిషి సునాక్ ఉన్న ఫళంగా ఎందుకు వెళ్లిపోయారన్నది మాత్రం తెలియరాలేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related Posts

Latest News Updates