ఏడాదికి కనీసం ఒక్క హిట్ అయినా లేకుండా ఆయన కెరీర్ గడవలేదు. సినిమా హీరోల్లో ఈ అరుదైన ఘనత ఉన్న హీరో అజయ్ దేవ్‌గణ్. ఆయన పుట్టినరోజు ఇవాళ. అజయ్‌దేవ్‌గణ్ పుట్టినరోజు సందర్భంగా మైదాన్ సెన్సేషనల్ ఫైనల్ ట్రైలర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒకటా, రెండా ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొన్న లెజండరీ కోచ్ ఎస్.అబ్దుల్ రహీమ్, ఆయన ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ గురించి ఈ ట్రైలర్ మరింత అద్భుతంగా ఆవిష్కరించింది. ఫుట్‌బాల్ రంగంలో మన ఇండియా టీమ్… చరిత్రను ఎలా తిరగరాసిందో చెప్పే చిత్రమే మైదాన్.
ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అంకిత భావం, అచంచలమైన విశ్వాసం, ఫుట్‌బాల్ రంగంలో వెలుగులు చాటాలనే తపనతో ముందడుగేసి, రాణించి మన దేశానికి గర్వకారణంగా నిలిచిన లెజండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.