శివ కంఠనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అన్నపూర్ణమ్మ, డైరెక్టర్ నీలకంఠ, మ్యూజిక్ డైరెక్టర్ సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేష్, సుచర్ ఇండియా కిరణ్, వరా ముళ్లపూడి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ ‘‘‘రాఘవ రెడ్డి’ ట్రైలర్ చూడగానే మసాలాలు అన్ని దట్టించి తయారు చేసిన హైదరాబాద్ బిర్యానీలాగా అనిపించింది. ట్రైలర్ చూడగానే కథ, బ్యాగ్రౌండ్ ఏంటనేది అర్థమవుతుంది. హీరో శివ కంఠమనేని చాలా చక్కగా ఉన్నారు. మంచి పేరు వస్తుంది. ఆయన గత చిత్రం మధురపూడి గ్రామం అనే నేను సినిమా చాలా పెద్ద హిట్టయ్యింది. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైంది. దానికి బెస్ట్ మూవీ అవార్డు రావాలని అనుకుంటన్నాను. మంచి కాస్ట్ అండ్ క్రూతో చేసిన సినిమా. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ ‘‘ ఇంతకు ముందు చేసిన మధురపూడి గ్రామం అనే నేను చిత్రంలో రగ్డ్ పాత్రను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో సిన్సియర్, స్ట్రిట్ ప్రొఫెసర్ గా నటించాను. రాశిగారు, నందితా శ్వేత కీలక పాత్రల్లో నటించారు. ఇంకా రఘుబాబు, పోసాని, అజయ్, అజయ్ ఘోష్ సహా చాలా మంది నటించారు. చక్కటి విందు భోజనంలా నవ రసాలున్న సినిమా. తప్పకుండా సినిమా అందరినీ మెప్పిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.
చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘‘లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థతో మూడున్నరేళ్లుగా పరిచయం ఉంది. శివ కంఠమనేని గారిని అప్పుడు కలిశాను. ఆయనకు తగ్గట్లుగా రాఘవ రెడ్డి అనే కథను తయారు చేశాను. చిన్న సినిమా అవుతుందిలే అనుకుంటే.. తర్వాత రాశిగారు, నందితా శ్వేతగారు, పోసాని, బిత్తిరి సత్తి, రఘుబాబు, అజయ్, అజయ్ ఘోష్.. ఇలా చాలా మంచి ఆర్టిస్టులను ఇచ్చారు. చాలా పెద్ద బాధ్యతగా ఫీల్ అయ్యాను. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చాను. ఇది ఫ్యాక్షన్ కథ కాదు..ఇందులో క్రిమినాలజీ ప్రొఫెసర్ గా శివ కంఠమనేని నటించారు. ఆయన పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంది. ఆయన గత చిత్రం మధురపూడి గ్రామం అనే నేను సాధించిన విజయానికి, రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక కావటం నాకెంతో ఆనందంగా ఉంది. జనవరి 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా సినిమాను తెరకెక్కించాం. సుధాకర్ మారియోగారు చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. ఆయనతో కలిసి నేను కూడా నటించాను. ఎస్.ఎన్.హరీష్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఆవుల వెంకటేష్‌గారు ఎడిటర్ గా వర్క్ చేశారు. ఇక ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ సహా అందరికీ థాంక్స్. రచనా సహకారం చేసిన సత్యమూర్తిగారికి, డైలాగ్స్ రాసిన అంజన్ గారికి ధన్యవాదాాలు. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘మా లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్ నుంచి వస్తున్న వస్తోన్న మూడో సినిమా ఇది. జనవరి 4న రిలీజ్ చేయటానికి సిద్ధమవుతున్నాం. మా రెండో చిత్రం మధురపూడి గ్రామంకు వచ్చిన రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉంది. డైరెక్టర్ సంజీవ్ మేగోటిగారు కథను చెప్పగానే అందరికీ నచ్చింది. మా సినిమాను సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో సినిమా చేశారని తెలుస్తుంది. అలాగే సినిమా రిచ్‌గా తెరకెక్కించారని అర్థమవుతుంది. సినిమాలో హీరోగా నటించిన శివ కంఠమనేని, దర్శకుడు సంజీవ్ మేగోటిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ‘‘మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆడవాళ్లకు తొందరపాటు ఎక్కువ ఉంటుందని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. మంచి ఫ్యామిలీ స్టోరి.. క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలుంటాయి. నిర్మాతలు మంచివాళ్లు. ఇలాంటి వాళ్లు ఉంటే మరిన్ని మంచి సినిమాలు వస్తాయని భావిస్తున్నాను’’ అన్నారు.
ఎడిటర్ ఆవుల వెంకటేష్ మాట్లాడుతూ ‘‘రాఘవ రెడ్డి’ మంచి కమర్షియల్ అంశాలతో అందరినీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు.
అజయ్ ఘోష్ మాట్లాడుతూ ‘‘రాఘవరెడ్డి సినిమాను చేయటానికి కారణంగా శివగారు. ఆయనలో కమ్యూనిజం భావజాలం ఉంది. దర్శకుడు సంజీవ్‌తో కూడా ఎప్పటి నుంచో పరిచయం ఉంది. భాగవతంలో నరకాసురుడిగా నటించిన తర్వాత టీవీ ఇండస్ట్రీ నన్ను గుర్తించింది. పూరీ జగన్నాథ్‌గారు జ్యోతీ లక్ష్మీ సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చారు. అక్కడి నుంచి నా ప్రయాణం అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయానికి వస్తే విలన్‌గా చేశాను. చాలా చక్కగా డిజైన్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో దమ్ముగల ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉన్నారనే విషయం అందరికీ తెలుస్తుంది. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవటంలో శివగారు ముందుంటారు. హైదరాబాద్ దమ్ బిర్యానీలాంటి సినిమా ఇది. ఈ సినిమాను ఆదరిస్తే మరిన్ని మంచి కంటెంట్ సినిమాలు వస్తాయి. ఎంటైర్ టీమ్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.
సుచర్ ఇండియా కిరణ్ మాట్లాడుతూ ‘‘నేను శివ కంఠమనేనితో రెగ్యులర్ గా మాట్లాడుతుంటాను. రాఘవ రెడ్డి సినిమాను తను చేస్తున్న క్రమంలో తనెంతో ఇన్‌వాల్వ్ అయ్యారో తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీతో ఉన్న పరిచయంతో మళ్లీ ప్యాషన్‌తో ఎంట్రీ ఇచ్చారు. శివకు ఇది కచ్చితంగా బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. అందరూ సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి సినిమాలను చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు
నటీనటులు :
శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ, రాఘవరెడ్డి తదితరులు.
సాంకేతిక వర్గం:
బ్యానర్ : లైట్ హౌస్ సినీ మ్యాజిక్, సమర్పణ : స్పేస్ విజన్ నరసింహ రెడ్డి, డైలాగ్స్ : అంజన్, లిరిక్స్ : సాగర్ నారాయణ, పి.ఆర్.ఒ: సురేంద్ర నాయుడు – ఫణి (బియాండ్ మీడియా), మ్యూజిక్ : సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో, ఫైట్స్ : సింధూరం సతీష్, డాన్స్ : భాను, సన్ రే మాస్టర్ (సూర్య కిరణ్), ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ : కేవీ రమణ, DOP : S. N. హరీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఘంటా శ్రీనివాస్ రావు, నిర్మాతలు : K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి.