దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మెసేజ్ లు చేయలేకపోతున్నారు. మధ్యాహ్నం 12.07 గంటల నుంచి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. పర్సనల్ మెసేజ్ లకు సింగిల్ టిక్ మాత్రమే వస్తుండగా.. స్టేటస్ లు కూడా అప్ డేట్ కావడం లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు అయోమయానికి గురవుతున్నారు.

 

 

వాట్సప్ యూజర్లు తొలుత ఇంటర్నెట్ ప్రాబ్లెం కారణంగా మెసేజ్ పంపలేకపోతున్నామని భావించారు. కానీ అరగంట గడిచినా ప్రాబ్లెం కంటిన్యూ కావడంతో విషయం అర్థమైంది. భారత్తో పాటు ఇటలీ, టర్కీలోనూ వాట్సప్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై సంస్థ స్పందించింది. వీలైనంత తొందరగా తిరిగి సేవలను పునరుద్ధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

Related Posts

Latest News Updates