ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తున్న ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ఉమ్మడిగా కృషి చేస్తామని భారత్, జర్మనీలు ప్రకటించాయి. జర్మనీ ఛాన్సలర్ ఓలఫ్ స్కోల్జ్ భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు మాట్లాడుతూ ఉక్రెయిన్ అంశాన్ని ప్రస్తావించారు. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ సంక్షోభం యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతును దేశాలు వీటితో ప్రతికూలంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి ప్రయతాుల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని మేమిద్దరం అంగీకరిస్తున్నము. మేము దీనిపై దృష్టి పెడుతున్నామని అన్నారు.












