ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిస్సైల్ ను డెవలప్ చేసింది. తమ మిలటరీ కమాండర్ ఖాసీం సోలిమనిని చంపినందుకు ప్రతీకారంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమారుస్తామని ఇరాన్ హెచ్చరించింది. రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ అమిరాలి హజీజాదె మాట్లాడుతూ 1,650 కిలోమీటర్ల పరిధి నూతన క్షిపణితో తమ ఆయుధ సామర్థ్యం పటిష్ఠమైందని తెలిపారు. 2020లో అమెరికా డ్రోన్లతో దాడి చేసి ఖాసీంను హతమార్చిందని, ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, అమెరికా సెక్రటరీ మైక్ పాంపియో, మిలటరీ కమాండర్లను కూడా చంపేస్తామని హెచ్చరించారు. 1650 కిలోమీటర్ల దూరం వెళ్లే క్రూయిజ్ మిస్సైల్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అమ్ములపొదిలో చేర్చినట్లు ఆయన వెల్లడించారు.












