డిసెంబర్ 13న రాబోతోన్న ‘ప్రణయ గోదారి’ని చూసి విజయవంతం చేయండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శక, నిర్మాత విఘ్నేశ్

సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో రాబోతోన్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రణయగోదారి టీం అంతా కలిసి ఓ చిన్నారి గుండెకు సంబంధించిన ఆపరేషన్ కోసం ఆర్థిక విరాళాన్ని అందించింది. అనంతరం..

సోహెల్ మాట్లాడుతూ.. ‘ఓ చిన్న చిత్రం బయటకు రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందో నాకు తెలుసు. డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి రారు. పేరు కోసం ఇక్కడకు వస్తారు. లక్ వస్తే.. డబ్బులు కూడా వస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమాను తీశాను. నష్టపోయాను. నన్ను ట్రోలింగ్ కూడా చేశారు. హిట్టు కొట్టాలనే ఎవ్వరైనా సినిమాను చేస్తారు. ప్రణయ గోదారి టీంలో అందరూ కొత్త వాళ్లే. వారి కష్టాన్ని గుర్తించి థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడండి. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో చాలా నేచురల్‌గా చేశారు. కొత్త హీరో, దర్శక, నిర్మాతల్ని ఆడియెన్స్ ఎంకరేజ్ చేయాలి. డిసెంబర్ 13న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

దర్శక, నిర్మాత విఘ్నేశ్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన తీన్మార్ మల్లన్న, రాజ్ కందుకూరి, సోహెల్ గార్లకు థాంక్స్. నేను ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆస్తులన్నీ అమ్ముకున్నా. అప్పులు తెచ్చి మరీ సినిమాను తీశాను. నా అన్న మార్కండేయ కోసం ఈ మూవీని చేశాను. మా అన్న ఈ చిత్రానికి మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ప్రసాద్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. చాలా కష్టపడి చిత్రాన్ని అయితే తీశాను. కానీ రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మళ్లీ అప్పు చేశాను. సినిమా తీయడం, రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. పి.ఆర్.ఓ. సాయి సతీష్ గారు చిన్న చిత్రాలకు దొరికిన అద్భుతమైన వరం. ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వచ్చి మా సినిమాకు థియేటర్లు ఇస్తామని అన్నారు. మా సినిమా డిసెంబర్ 13న రాబోతోంది. అందరూ వచ్చి చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి టైటిల్ నాకు చాలా నచ్చింది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. సినిమాల్లో పెద్దది, చిన్నది అని ఉండదు. పెళ్లి చూపులు చిన్న బడ్జెట్‌లో చేశా. కానీ దాన్ని పెద్ద హిట్ చేశారు. అందుకే మంచి సినిమా, చెడ్డ సినిమా అని ఉంటంది. ప్రణయ గోదారి మంచి చిత్రం అవుతుంది. విఘ్నేశ్ చాలా మంచి వ్యక్తి. మార్కండేయ గారి సంగీతం బాగుంది. ఈ చిత్రానికి మీడియా సహకారం అందించాలి. డిసెంబర్ 13న రానున్న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ ప్రసవించే సమయంలో ఎలాంటి స్థితిలో ఉంటుందో.. సినిమా రిలీజ్ టైంలో నిర్మాత కూడా అలానే ఉంటాడనిపించింది. చిన్న చిత్రమా? పెద్ద సినిమానా? అన్న తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు. సినిమా అంటే సినిమా అంతే. ఉద్యమ సమయంలో కొన్ని డాక్యుమెంటరీలు నేను కూడా తీశాను. ఈ మూవీ టైటిల్ నాకు చాలా నచ్చింది. ట్రైలర్, సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. డిసెంబర్ 13న రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మా చిత్ర ప్రమోషన్స్‌ కోసం వచ్చిన రాజ్ కందుకూరి, సోహెల్‌కు థాంక్స్. ఈ చిత్రంతో నేను తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. నా మీద నమ్మకం పెట్టుకుని నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. డీఓపీ ప్రసాద్ గారు మమ్మల్ని బాగా చూపించారు. మార్కండేయ గారి సంగీతం చాలా బాగా వచ్చింది. సదన్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రం డిసెంబర్ 13న రాబోతోంది. అందరూ ఆశీర్వదించండి’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి ఎంతో విశాలంగా ఉంటుంది. పి ఎల్ విఘ్నేశ్ గారి వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అని అనుకుంటున్నాను’ అని అన్నారు.

నటి ఉషా శ్రీ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. ప్రణయ గోదారిలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సాయి కుమార్‌ గారితో మళ్లీ కూతురిగా నటించే ఛాన్స్ వచ్చింది. సదన్, ప్రియాంక అద్భుతంగా నటించారు. డిసెంబర్ 13న మా చిత్రాన్ని చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

Related Posts

Latest News Updates