అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో వివేక్ రామస్వామి ?

అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే భారత సంతతి  మహిళ, రిపబ్లికన్ పార్టీ సీనియర్ నాయకురాలు నిక్కి హెలీ  తాను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అదే రిపబ్లికన్ పార్టీ నుంచి మరో ఇండో-అమెరికన్  అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. మిలియనీర్ వివేక్ రామస్వామి 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు  ప్రకటించారు.

రామస్వామి కేరళ నుండి యూఎస్ వలస వెళ్లిన భారతీయ తల్లిదండ్రులకు సిన్సినాటిలో జన్మించారు. అతని తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీర్ కాగా, తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి విద్యను అభ్యసించారు. వోక్, ఇంక్: ఇన్సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్ రచయిత అయిన రామస్వామి ఒక ప్రముఖ బయోటెక్ వ్యవస్థాపకుడు కూడా. అతను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)  ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశాడు.  రామస్వామి ప్రస్తుత నికర సంపద 500 మిలియన్ డాలర్లకు (రూ.41,379,171,500) పైగా ఉంది. నివేదికల ప్రకారం అతని ఎన్నికల ప్రారంభ ప్రచారానికి ఇది సరిపోతుంది అనేది అక్మాన్ అభిప్రాయం. అంతేగాక అన్నీ కలిసొస్తే అమెరికా అధ్యక్షుడిగా వివేక్ రామస్వామిని చూడొచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.

Related Posts

Latest News Updates