కశ్మీర్ ఫైల్స్ అర్బన్ నక్సల్స్ కి నిద్ర లేకుండా చేసింది : ప్రకాశ్ రాజ్ కి అగ్నిహోత్రి కౌంటర్

ది కశ్మీర్ ఫైల్స్ చెత్త సినిమా అంటూ కామెంట్స్ చేసిన ప్రకాశ్ రాజ్ కి ఆ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రకాశ్ రాజ్ అంధకార్ రాజ్ అంటూ అభివర్ణించాడు. జనాలు ఆదరించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ అర్బన్ నక్సల్స్ కి నిద్ర లేకుండా చేసింది. అలాంటిది వీక్షకులను మొరిగే కుక్కలు… అని పిలుస్తూ సినిమా రిలీజైన ఏడాది తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నారు. మిస్టర్ అంధకార్ రాజ… భాస్కర్ ఎప్పటికీ మీదే అయినప్పుడు నేనెలా పొందుతాను అంటూ జబర్దస్త్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అగ్నిహోత్రి ట్వీట్ వైరల్ అవుతోంది.

 

కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ది కశ్మీర్ ఫైల్స్ చెత్త సినిమా అంటూ వ్యాఖ్యానించాడు. ఆ సినిమాపై ఇంటర్నేషనల్ జ్యూరీ పక్కన పెట్టేసిందంటూ పేర్కొన్నారు. అర్థంపర్థం లేని సినిమాల్లో “కశ్మీర్ ఫైల్స్” ఒకటి. దాన్ని ఎవరు నిర్మించారో మనకందరికీ తెలుసు. ఇది సిగ్గులేనితనం. ఇంటర్నేషల్ జ్యూరీ కూడా దీన్ని పట్టించుకోలేదు. కానీ వాళ్లకు సిగ్గు రాలేదు. నాకు ఆస్కార్ ఎందుకు రాలేదని ఆ సినిమా డైరెక్టర్ ఇప్పటికీ అంటున్నారు. ఆస్కార్ కాదు కదా.. ఆయనకు భాస్కర్ అవార్డు కూడా రాదు. అంటూ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates