”విరూపాక్ష” సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్…

విరూపాక్ష సినిమాపై హీరో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. తన అమ్మ కోసమే విరూపాక్ష సినిమా చేశానని, ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్ కి ధన్యవాదాలు చెబుతున్నానని ప్రకటించారు. సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించి, నిర్మాణ భాగస్వామిగా వుండటం తనకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. విరూపాక్ష సినిమా టైటిల్ గ్లింప్స్ ను సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు. ఎన్టీఆర్ వాయిస్ తో ఈ గ్లింప్స్ సాగడం ఓ ప్రత్యేకత.

1990 లో సాగిన అడవి ప్రాంతంలోని ఓ గ్రామం నేపథ్యంగా సాగే థ్రిల్లర్ మూవీ విరూపాక్ష అని దర్శకుడు కార్తిక్ దండు వెల్లడించాడు. అక్కడ జరిగే వింత పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొంటాడన్నదే సినిమా థీమ్ అన్నారు. బాపినీడు బి. సమర్పణలో, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

Related Posts

Latest News Updates