దీపావళి ధమాకా… ఉత్కంఠ పోరులో.. పాక్ పై భారత్ విజయం

చివరాఖరు వరకూ తీవ్ర ఉత్కంఠతగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాకు విజయం చేకూర్చాడు. టాస్ గెలిచి పాక్ కు బ్యాటింగ్ ఇవ్వగా… పాక్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 159 పరుగులు చేసింది. ఓపెనర్లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. అయితే.. షాన్ మసూద్ (52), ఇఫ్తికార్ అహ్మద్ (51) తో కాస్త ఓకే అనిపించారు. మసూద్ పరుగులు తీయగా…. షాహీన్ అఫ్రీది తోడయ్యాడు. దీంతో పాక్… 159 పరుగులు చేసింది.

 

 

ఇక… 160 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా ఇద్దరూ మ్యాచ్ ను ఓ మలుపు తిప్పేశారు. మొదట్లో మెళ్లిగా ఆడిన కోహ్లీ… తర్వాత ఫోర్లు, సిక్సర్లతో బాదిపడేశాడు. కోహ్లీ 82 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. చివర్లో అశ్విన్ ఫోర్ కొట్టి.. మ్యాచ్ ను గెలిపించాడు. మ్యాచ్ లో కోహ్లీ హీరోగా నిలిచాడని చెప్పాలి.

Related Posts

Latest News Updates