బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్ వేద’.సెప్టెంబర్ 30న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో హృతిక్ గ్యాంగ్‌స్టర్‌గా.. సైఫ్ ఆలీఖాన్ పోలీస్ ఆఫిసర్‌గా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో ఇద్దరూ పోటాపోటీగా నటించి మెప్పించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రీమేక్ మూవీని రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, టీ సిరిస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్‌కు జోడీగా రాధికా ఆప్టే నటించింది. తమిళంలో సూపర్ హిట్టైన ‘విక్రమ్ వేద’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.